ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌. సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనల కోసం వివిధ రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించిన కేంద్రం.

ప్రతిష్టాత్మక జీ–20 దేశాల సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సదస్సు విజయవంతానికి రాష్ట్రం తరపున అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జీ–20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)