మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బావ అయిన ద్వారకానాథరెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి.. దివంగత సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో టీడీపీ నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి.

ఈయనతో పాటుగా . వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు, ఆయన తనయులు దాడి రత్నాకర్, దాడి జైవీర్, బాపట్ల జిల్లా, కర్లపాలెం జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, అనంతపురానికి చెందిన డా.కె.రాజీవ్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చీరాలకు చెందిన మాజీ అధికారి నక్కల అర్జున రావు, హైకోర్టు న్యాయవాది సింగయ్య గౌడ్, పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లతో మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Here's TDP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)