Gannavaram MLA Vallabhaneni Vamsi Accident Video: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు. శనివారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, కాసింపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పెద్దగా గాయపడకుండా బయటపడడం విశేషం.

సూర్యాపేట వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం
విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే వంశీ.. చివ్వెంల మండలం కాసీంపేట వద్ద ఘటన.
కాన్వాయిలో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు. వంశీతో సహా సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది. అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. pic.twitter.com/4okji3GFfB
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 19, 2023 05:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

