ఏపీలో కూటమి ప్రభుత్వ వచ్చాక జరిగిన దాడులపై నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని రాజకీయ ప్రత్యర్థులకు ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ‘‘కావాలంటే నన్ను టార్గెట్ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’’ అని వైఎస్ జగన్ సూటిగా నిలదీశారు. వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్
Here's Video
నన్ను చంపాలనుకుంటే.. చంపేయండి. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు.
- @ysjagan గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #YSRCPProtestsInDelhi#SaveAPFromTDP pic.twitter.com/TIUSZIO5Ln
— YSR Congress Party (@YSRCParty) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)