ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్‌ నియామకం జరిగింది. కొత్త సీఎస్‌ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నీరభ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.

Neerabh Kumar Prasad as the New CS of Andhra Pradesh.. Orders issued

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)