కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఏపీలోని రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు.
కార్యక్రమం అనంతనం ఆయన రాజమహేంద్రవరం సమీపంలోని నర్సరీల గ్రామం కడియపులంక చేరుకున్నారు. గ్రామంలోని సత్యదేవ్ నర్సరీలో ఆయనకు వినూత్న స్వాగతం లభించింది.ఫ్లెక్సీలతో పాటుగా మొత్తం పూలతోనే గడ్కరీ చిత్రాన్ని ఆవిష్కరించారు. వివిధ రకాల కలర్ ఫుల్ పూలతో గడ్కరీ బొమ్మను తీర్చిదిద్దిన సత్యదేవ్ నర్సరీ యాజమాన్యం తాము అనుకున్నట్లుగానే గడ్కరీని థ్రిల్ కు గురి చేసింది. పూలతో అద్దిన తన చిత్రాన్ని గడ్కరీ అలా చూస్తూ నిలబడిపోయారు.
►కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
►కేంద్ర మంత్రి పర్యటనకు పూల కడియం సిద్దం
►పువ్వులతో గడ్కరీ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.@nitin_gadkari pic.twitter.com/OHDh6IwHen
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 22, 2022
► అక్కడ నర్సరీని తిలకిస్తారు.అనంతరం నర్సరీ రైతుల సమావేశంలో పాల్గొంటారు.
►కేంద్ర మంత్రికి సత్యదేవ నర్సరీలో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసారు.@nitin_gadkari pic.twitter.com/gZFT1xu5IC
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) September 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)