ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల అంశాన్ని నడ్డా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనను పవన్ కల్యాణ్ కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా నడ్డా తెలియజేశారు. వీరి భేటీలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

Pawan Kalyan meets JP Nadda

Here's JP Nadda Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)