ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి.. కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమించింది.

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు

టీడీపీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా, ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడి

Praveen Aditya is the new MD of AP Fibernet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)