దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ముర్ము ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆమెకు టీడీపీ ఘనస్వాగతం పలికింది.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని వెల్లడించారు. ఇక సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని, కానీ పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో విలపించిన దృశ్యాలను కలిపి ట్విట్టర్ లో పంచుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)