ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు.

ఇదే సచివాలయంలో ఉన్న మహిళలు బురుగు, బెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారుచేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Secretariat employees and volunteers arrested for making fake certificates in Andhra Pradesh

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)