ఆంధ్రప్రదేశ్‌లో భారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ మేనేజ్‌మెంట్ టీమ్ ముందుకొచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పెదగార్లపాడులో ఫ్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీ సిమెంట్ టీమ్ ఎండీ హెచ్ ఎం. బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్‌లు సోమవారం సీఎం వైఎస్ జగన్ కలిసి దీని గురించి చర్చించారు. ఏపీలో నూతన పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్ మేనేజ్‌మెంట్ టీమ్‌తో సీఎం జగన్ చర్చించారు. ఏపీలో శ్రీ సిమెంట్ గ్రూప్ నుంచి ఇది తొలి ప్రాజెక్టు. కాగా, రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.
A delegation of Shree Cement led by its MD H M Bangur and JMD Prasanth met @ysjagan and held discussions on setting up Green Field Cement plant at Pedagarlapadu village in Guntur district with an estimated cost of Rs 1,500 crore.#HBDManOfMassesYSJagan
— $owjanya_R€dd¥ (@_scorpi_on) December 20, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)