ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్‌ గ్రూపు సన్నద్దత వ్యక్తం చేసింది. అలానే వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది. ఈ యేడాది నవంబరులో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్ధాపన చేస్తామని ఎస్సార్‌ గ్రూపు ప్రతినిధులు సీఎం జగన్‌కు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్‌‌ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)