శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.ఈ రోజు ఇంట్లో బాత్‌రూమ్‌లో కాలుజారి పడిన డా. బీఎస్‌రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాసం విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడకు తరలించనున్నారు.
డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2023/07/BS-Rao-Dies.jpg)
Here's News
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు కన్నుమూత
బాత్‌రూమ్‌లో కాలుజారి పడిన డా. బీఎస్‌రావు
రేపు విజయవాడలో బీఎస్‌రావు అంత్యక్రియలు
1986లో శ్రీచైతన్య సంస్థలను స్థాపించిన బీఎస్ రావు#BNRao #SriChaitanyaEducationInstitutions
— TV9 Telugu (@TV9Telugu) July 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)