లోక్‌సభ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కుప్ప కూలిపోతుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల దాకా ఆ పార్టీకి అధికారం దక్కలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా అబద్దపు హామీలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించారని తెలిపారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తొందరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా చేర్చేవారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్‌ నేతల్లో ఏకాభిప్రాయం లేదని అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)