ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌)కేసులో తెలంగాణ హైకోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.దీనిపై విజయసాయి రెడ్డి ఒక అహంకార కేడీ పోలీస్ అధికారి సహకారంతో దుర్మార్గపు పచ్చకులమంద ఒక సీనియర్ IAS అధికారిణిని కేసుల్లో ఇరికించారంటూ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)