మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు (Tomato Prices) ఒక్కసారిగా పతనమయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 5న) టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయి మార్కెట్‌లో టమాటా ధరలు మరింత పడిపోయాయి. నాణ్యతను బట్టి క్వింటా టమాటా ధర కనిష్ఠంగా రూ. 800 నుంచి గరిష్టంగా రూ. 1600 వరకు పలికింది. రోజు రోజుకు సరుకు దిగుబడి పెరుగుతుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ ధర ప్రకారం కిలో రూ. 8 అంతకంటే తక్కువగానే ఉన్నాయి. దీంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాదంటున్నారు. మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి వెళ్తున్నారు. వీడియోలు ఇవిగో..
Here's Videos
కిలో టమోటా 4 రూపాయలు
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయం మార్కెట్‌లో దారుణంగా పడిపోయిన టమోటా ధరలు. కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాదంటున్న రైతులు.
మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి వెళ్తున్న రైతులు. pic.twitter.com/jkxMKVN7FE
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)