Ram Mohan Naidu: ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మెన్గా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది.
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
Here's News
➡️ Union Civil Aviation Minister Rammohan Naidu (@RamMNK) inaugurated 2nd Asia-Pacific Ministerial Conference on Civil Aviation in New Delhi
➡️ Union Minister Ram Mohan Naidu elected chairman of Asia-Pacific Ministerial Conference on Civil Aviation
➡️ The Minister called for… pic.twitter.com/3Fseii0V6v
— PIB India (@PIB_India) September 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 12, 2024 10:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

