ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అధినాయకత్వం సస్పెండ్ చేసిన నలుగురిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరు. కాగా, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి సస్పెన్షన్ ప్రకటన చేసిన వెంటనే గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై దాడి జరిగింది. అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లు ధ్వంసం చేశారు. పార్టీ పట్ల ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. దాంతో శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని అడ్డుకున్నారు.
Here's Video
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీసు దగ్గర ఉద్రిక్తత
▪️ఆఫీసు దగ్గర ఉన్న ఉండవల్లి ఫ్లెక్సీలను చించేసిన వైసీపీ కార్యకర్తలు.
▪️ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు.
▪️ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ మీద దాడి చేసి ఫ్లెక్సీలు చింపి గొడవ చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు. pic.twitter.com/XRVALZtnBa
— Vamsi Krishna Kaperla (@tarak_vamsi9999) March 24, 2023
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ పై దాడి చేసిన వైసీపీ శ్రేణులు. 💦💦
కోటంరెడ్డి, ఆనం, మేకపాటి ఆఫీసులపై ధాడి చేసే ధైర్యం ఉందారా మీకు.
నెల్లూరు వాళ్ల జోలికి వైళ్తే కోసి చేతిలో పెట్టి పంపిస్తారు . ఒక దళిత మహిళా ఎమ్మెల్యే పైన రా మీ ప్రతాపం 💦#TDPTwitter @MlaSrideviDr pic.twitter.com/IO8kNLDCM7
— Reddy Chandu (@reddychandutdp) March 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)