వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. తనపై కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో సోమవారం (జూలై 15) మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని.. ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. మదన్‌ మోహన్ అనే వ్యక్తి తనను రెండుసార్లు కలిశాడని.. స్కాలర్‌షిప్‌ కోసం వస్తే సాయం చేశానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘అధికారిణి శాంతితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నువ్వు నన్ను ఎన్నిసార్లు కలిశావు’ అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.. నాలుగుసార్లు కలిస్తే, ఇద్దరం గే అని వార్తలు సృష్టిస్తారు అంటూ చురకలు అంటించారు. ఈ అంశంపై మహిళా కమిషన్‌ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని, పార్లమెంట్‌లోనూ ప్రైవేట్ బిల్లు పెడతానని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)