మీడియాలో, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి మండిపడుతున్నారు. తాజాగా నారా లోకేష్ మీద విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత 20 నెలల మీ వీడియోలను మీరే చూసుకోడండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?" అంటూ ధ్వజమెత్తారు. . నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Here's Tweets
Sri @naralokesh, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
Sri @naralokesh, అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు, సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
Sri @naralokesh, రాష్ట్రంలో ఈ మధ్య నలబై రోజులుగా జరుగుతున్న నేరాలు, ఘోరాలకు కూటమి ప్రభుత్వం లో పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు, వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
Sri @naralokesh, విద్యారంగం దారి తప్పింది. పాలకులు మాట తప్పుతున్నారు. స్కాలర్ షిప్ లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి, విద్యా రంగం పై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ముందు దాని మీద దృష్టి పెట్టండి!
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)