ఏపీ కూటమి దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. వీడియో ఇదిగో, వైసీపీ ధర్నాకు ఉద్దవ్ శివసేన మద్దతు, జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన ఎంపీ సంజయ్ రౌత్
ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదన్నారు. కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.
Here's Video
#WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut joins Former Andhra Pradesh CM and YSRCP President Jagan Mohan Reddy at YSRCP's protest against Andhra Pradesh govt at Jantar Mantar in Delhi pic.twitter.com/sBQCROnOB5
— ANI (@ANI) July 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)