ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది(SBI ATM Heist). షిఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టారు నలుగురు దొంగలు.
సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ సెన్సార్ వైర్లను కట్ చేశారు దొంగలు(Thieves Steal ₹30 Lakh from SBI ATM). కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి రూ.30 లక్షలు చోరీ చేశారు. 4 నిమిషాల్లో చోరీ చేసి పరారైయ్యారు దొంగలు. దొంగల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు.
ఇక మరో వార్తను పరిశీలిస్తే హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు. అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
ATM Heist: Thieves Steal ₹30 Lakh from SBI ATM in Ranga Reddy
ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం
షిఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టిన నలుగురు దొంగలు
సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ సెన్సార్ వైర్లను కట్ చేసిన దొంగలు
కట్టర్, ఇనుపరాడ్ల… pic.twitter.com/r7c7aTOGXg
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)