తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటనలో ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు, పిల్లవాడితో పుట్ బాల్ గేమ్ ఆడుతూ సరదాగా గడుపుతున్న వీడియోని తన ఖాతాలో పంచుకున్నారు. పిల్లలతో ఆడుకోవడం నన్ను ముందుకు నడిపిస్తుంది...వారు దానిని సాకర్ అని పిలుస్తారు, మేము దానిని ఫుట్‌బాల్ అని పిలుస్తాము అంటూ ట్వీట్ చేశారు.

ఇక సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయప్రదాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఖండించారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే..సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్‌ కొడుకైనా తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘దీనిపై నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్‌ ఎందుకు స్పందించరు? హిందూధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూసమాజాన్ని కోరుతున్నాం’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో పర్యటనలో భాగంగా బండి సంజయ్‌ నార్త్‌ కరోలినాలోని చార్లెట్‌లోని హిందూ సెంటర్‌లో ‘ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ’నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Bandi Sanjay played Football Game with the child Watch Video (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)