శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పోలీసులు ఆఘమేఘాల మీద తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్ చేసిన పోలీసులు అతనిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు. భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్ చేసి బెదిరించాడట.
Here's ANI Tweet
A Chennai-Hyd flight today received a hoax bomb threat call at RGI International airport. The airport security checked the flight evacuating the passengers. The hoax call was made by a passenger as he got delayed to catch the flight. Accused passenger taken into custody: Police
— ANI (@ANI) February 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)