తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన కేసీఆర్‌ బర్త్‌డే వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కాచిగూడలో కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో టపాసులు పేలుస్తుండగా నిప్పు రవ్వలు పడి బెలూన్లు పేలిపోయాయి. భయంతో పరుగెత్తుతుండగా తోపులాట జరిగిఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, మరొకొందరు కార్యకర్తలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే, కార్యకర్తలకు స్వల్పగాయాలు అయ్యాయి.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)