Hyderabad, Oct 13: నేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో (Telangana) ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను (Dasara Holidays) ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మొన్నటివరకు పరీక్షలు ముగిశాయి. నిన్న స్కూల్స్, కాలేజీలలో (Colleges) పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడారు. నేటి నుంచి దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.

IAPB Report: నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కుంటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 2.24 లక్షల కోట్ల నష్టం.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ బ్లైండ్‌ నెస్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)