గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ CEOని కలిసి హైకోర్టు తీర్పు ప్రతి అందించారు డీకే అరుణ. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు స్పందించింది. తెలంగాణ CEO ఇచ్చిన విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ గెజిట్ జారీ చేసింది. డీకే అరుణను 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది.

Election Commission has issued a notification naming DK Aruna as Gadwala MLA

Here's Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)