మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Here's News
గుండెపోటుతో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర తేజ్ ఆకస్మిక మృతి
సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న చంద్ర తేజ్. pic.twitter.com/4kGOhO1cHA
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)