పెద్దపల్లి జిల్లాలో ముత్తారం మండలం ఓడేడు పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన అర్థరాత్రి కూలిపోయింది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.
అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు సమాచారం. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు, నలుగురు అక్కడికక్కడే మృతి
Here's Video
Major tragedy averted, a portion of an under-construction bridge across #ManairRiver collapsed near Odedu village in Mutharam mandal of #Peddapalli dist
2 girders collapsed due to strong winds.
Constitution underway since 2016, estimate cost 47 crore.#Telangana #BridgeCollapsed pic.twitter.com/TDazDKnX2I
— Surya Reddy (@jsuryareddy) April 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)