పెద్దపల్లి జిల్లాలోని 62.5 మెగావాట్ల రామగుండం బీ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బాయిలర్‌లో బొగ్గు ను మండిస్తుండగా కోల్‌ఫైర్‌ బయటకు రావడంతో పవర్‌కేబుల్‌ అంటుకొని మంట లు చెలరేగాయి.ఫైర్‌ సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టా రు. కొంతమేరకు ఆస్తి నష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్లాంటులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.మళ్లీ పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కనీసం 10 రోజులపైనే పడుతుందని అధికారులు అంటున్నారు. ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)