రాహుల్ గాంధీ, జైరాం రమేష్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా బతుకమ్మను ఆడారు. అయితే చెప్పులతో బతుకమ్మ ఎలా ఆడుతారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇది ఘోరమైన అవమానమని బీఆర్ఎస్ పేర్కొంది. సోమవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగింది పార్టీ.
చెప్పులతో బతుకమ్మ ఆడి అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు
ఇది బతుకమ్మకు అవమానం...
ఇది మా అమ్మకు అవమానం.
రాహుల్ గాంధీ, జైరాం రమేష్ లాంటి ఓట్ల బిచ్చగాళ్లకు తెలంగాణ సంస్కృతి గురించి... బతుకమ్మ విశిష్టత గురించి ఎప్పటికీ తెలీదు.
తెలంగాణకు చెందిన పీసీసీ చీప్, ఇతర కాంగ్రెస్ నాయకులు పొలిటికల్ టూరిస్టులను ఆపకపోగా... వాళ్ళు కూడా అదే ఘోరం చేస్తున్నారు... చెప్పులు వేసుకుని బతుకమ్మ అడుతూ నవ్వుతూ, ఫోటోలకు పోజులిస్తున్నారు. తెలంగాణ అంటే, తెలంగాణ సంస్కృతి అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడూ చిన్నచూపే..కాంగ్రెస్ నాయకులారా... మీ ఫోటోల కోసం బతుకమ్మ అవమానించడం ఆపండి.తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ నాయకులు తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ మండిపడింది.
Here's Video
Rahul Gandhi ji celebrate Bathukamma in Telangana 🔥💪 pic.twitter.com/b1adzTeFeJ
— Ashish Singh (@AshishSinghKiJi) October 23, 2023
Heres' BRS Party Tweet
చెప్పులతో బతుకమ్మ ఆడి అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు
ఇది బతుకమ్మకు అవమానం...
ఇది మా అమ్మకు అవమానం.
రాహుల్ గాంధీ, జైరాం రమేష్ లాంటి ఓట్ల బిచ్చగాళ్లకు తెలంగాణ సంస్కృతి గురించి... బతుకమ్మ విశిష్టత గురించి ఎప్పటికీ తెలీదు.
తెలంగాణకు చెందిన పీసీసీ చీప్, ఇతర కాంగ్రెస్… pic.twitter.com/xbYH3eMXCA
— BRS Party (@BRSparty) October 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)