Keshava Rao Quits BRS Party: మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కేశవరావుని ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, , పార్టీ సీనియర్ కేసీ వేణుగోపాల్, మధు యాష్కీ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న
Here's Video
A decade after Rajya Sabha MP K Keshava Rao (#KK) quits #BRS & rejoins the #Congress party in the presence of AICC president #MallikajrunKharge, #Telangana Chief Minister & TPCC chief #RevanthReddy, MP #RahulGandhi and other senior leaders, in Delhi. pic.twitter.com/N0sbP5eIfQ
— Surya Reddy (@jsuryareddy) July 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)