భిక్షం అడిగినందుకు డిప్యూటీ ఎమ్మార్వో యాచకుడిపై దారుణంగా ప్రవర్తించాడు. బిక్షం అడిగాడని ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో అతను టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ కారులో ఆర్మూర్‌ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన యాచకుడు శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్‌ లేవని బదులిచ్చారు. గ్రీన్‌ సిగ్నల్‌ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు.

కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్‌ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్‌ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. రాజశేఖర్ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో శివరాం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)