బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రతీ కుటుంబంపై భారం పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన పాల్గొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500 లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తామన్నారు.

గృహ జ్యోతి స్కీమ్ కింద ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రతి కుటుంబంపై రూ.31 వేలకు పైగా భారం పడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా రైతు భరోసా కింద రూ.15 వేలు అందిస్తామన్నారు. అంతే కాకుండా ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు.

Rahul Gandhi (photo/X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)