తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్‌) అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. సాయంత్రం ఆరు వరకు లాక్‌డౌన్‌ కాలం సడలింపు, పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ, కరోనా నియంత్రణ, నీటిపారుదల శాఖలో అదనపు ఆయకట్టు కోసం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, వాటి పురోగతి, పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ సమావేశం ప్రారంభం కాగా, సమావేశంలో పీఆర్సీ, లాక్‌డౌన్‌, వైద్యం, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంటర్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌, భూముల డిజిటల్‌ సర్వే, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత, ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్ల ప్రారంభం, తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధ‌న‌లు స‌డ‌లించే అవకాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)