సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్‌తో సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వర్గీయులు, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు పోటాపోటీగా రెచ్చిపోయి నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. హుస్నాబాద్ శాసనసభ స్థానం నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుండి ఇరువురు నాయకులతో పాటు ఇరువర్గాల మధ్య అంతర్గతంగా వివాదం కొనసాగుతుండగా, ఈ వివాదం నేడు బయటపడింది.
Here's Videos
హుస్నాబాద్‌లో కొట్టుకొని మూతులు పగలకొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ప్రజల ముందే మూతులు పగిలేలా కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గాలు… pic.twitter.com/XEyfObIMUk
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)