హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఆమె అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వెళ్లి అక్కడ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల ఐడీ కార్డులను అడిగి తీసుకున్నారు. కొంతమందిని హిజాబ్ తొలగించమని కోరారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆమె ఆరోపించారు. ఐడీ కార్డులు సరిగ్గా చూసిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలని కోరారు.  హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)