ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు. అన్నోజిగూడ ఫ్లైఓవర్ వద్దకు రాగానే కారులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన యువకులు వెంటనే కారులో నుండి దిగి బయటకు పరుగులు పెట్టారు.
వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి
స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కారులో నుండి మంటలు రావడాన్ని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు.
అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు
షాక్ సర్క్యూట్‌తో కార్ దగ్ధం.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద షాక్ సర్క్యూట్‌తో దగ్ధం అవుతున్న కార్. ఓల్డ్ సిటీ నుండి కొమురవెల్లి దర్శనం కోసం కారులో నలుగురు స్నేహితులు వెళ్తుండగా జరిగిన ఘటన.. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. pic.twitter.com/PVeuXHTsuq
— ChotaNews App (@ChotaNewsApp) February 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)