తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో 130 కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఒక్కసారిగా ట్రాన్స్‌పార్మర్‌(Transfaram) పేలి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి బయటకు వచ్చారు. ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)