కరీంనగర్‌లో జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ మంటల్లో 50 50 పూరిళ్లు దగ్ధమయ్యాయని వార్తలు వస్తున్నాయి. పూరిళ్లలోని కార్మిక కుటుంబాలు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  కూకట్‌పల్లిలో కదులుతున్న కారులో మంటలు, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)