హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ పాటించడం లేదని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయమై మంత్రి స్పందించారు. వీడియో ఇదిగో, 2029లో ఏపీ సీఎంగా షర్మిల, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తాను అలిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అమ్మవారి భక్తులు ఎందుకు అలుగుతామన్నారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని తెలిపారు. దాంతో మేయర్ కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారని అన్నారు. తోపులాటను నిలువరించేందుకు కొద్దిసేపు ఆగినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తోపులాటపై అధికారులను ప్రశ్నించినట్లు చెప్పారు. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణలు చెప్పారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Here's Videos
అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం, మేయర్. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు ప్రోటోకాల్ పాటిచడం లేదని అలక.@PonnamLoksabha #minister #ponnamprabhakar #protocalissue #rtvnews #RTV pic.twitter.com/BIXnDsHVDm
— RTV (@RTVnewsnetwork) July 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)