హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్రలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడని గ్యారంటీ ఏందని అడిగేటోళ్లను.. మీరు మీ అమ్మ కే పుట్టారని గ్యారంటీ ఎందనీ అడిగినా.. తప్పా ? అని ప్రశ్నించారు. ఇవి దేశానికి, మోదీకి సంబంధించిన ఎన్నికలు.. మోదీ ప్రధాని కావల్నా, లేక రాహుల్ కావాల్నా. మోదీని ప్రధాని చేయకుంటే మందిరం పోయి మసీదు వస్తది.. ప్రజలే తేల్చుకోవాలి’’ అంటూ బండిసంజయ్ వ్యాఖ్యలు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)