తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది. తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేదు. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన తరఫున ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎనిమిది మంది కూడా జనసేన గుర్తు గ్లాస​్‌ కాకుండా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. జనసేన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లేదు.

EC denies Glass symbol for Jana Sena party

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)