తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దంతాలపల్లి మండలం బొడ్లాడ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.తొర్రూరులోని నలంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బుధవారం దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం నుంచి విద్యార్థులతో బయల్దేరింది. పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాపల్లికి చెందిన సుమారు 42 మంది విద్యార్థులతో బొడ్లాడ గ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో బొడ్లాడ శివారులో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లి బోల్తా పడింది.
దీంతో బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనతో ఆర్తనాదాలు చేశారు. బస్సులోకి విద్యార్థులను సమీపంలోని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతో బస్సును నడుపుతున్నాడని గతంలో ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బస్సు బోల్తా పడే సమయంలో డీజిల్ ట్యాంకర్ పేలినట్లయితే భారీ నష్టం వాటిల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Heres' Video
Several #Students had minor injuries, when a #SchoolBus carrying 30 students that lost control and overturned in #Danthalapally mandal of #Mahabubabad dist.
Students and Parents alleged, overspeed, reckless driving.#Telangana #RoadSafety #RoadAccident #SchoolBusAccident pic.twitter.com/tiKqLrZ2Wk
— Surya Reddy (@jsuryareddy) August 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)