తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు చెట్టును ఢీకొనడంతో గర్భిణి సహా 26 మందికి గాయాలైన సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొట్టింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తోంది. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డేవిడ్ రాజు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)