Hyderabad, Jan 5: పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi)కి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. పండుగను పురస్కరించుకుని 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులను (Bus Services) నిర్వహించనున్నట్టు చెప్పింది. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాలు చేసినట్టు వెల్లడించారు.
The #TSRTC has arranged 4,484 special buses for people going to their hometowns during #Sankranti festivities. Details inside.https://t.co/JRqG5S64Uz
— Telangana Today (@TelanganaToday) January 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)