ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Here's Videos
ములుగు౼హనుమకొండ జాతీయ రహదారి పై ఆత్మకూరు మండలం నిరుకుల్లా క్రాస్ వద్ద డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు డీ పలువురికి తీవ్ర గాయాలు. pic.twitter.com/uEmen7zqlR
— NARENDER (@IDEASOFNARENDRA) January 19, 2024
హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మం. నీరుకుల్ల క్రాస్ వద్ద డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు ఢీ.
ఆర్టీసీ బస్సులోని ప్రయాణీకులకు గాయాలు.ఇద్దరి పరిస్తితి విషమం.#BreakingNews #busaccident #hanumakonda #Telangana #BREAKING pic.twitter.com/OBiYL8wqyJ
— ChotaNews (@ChotaNewsTelugu) January 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)