నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
ప్రయాణాలు ఆగిపోవచ్చు కానీ, ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారు. ఇప్పుడు నా బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చింది. టీజీఎస్ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లు జీవనాడి. అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి, ప్రయాణికుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. త్వరలో టీజీఎస్ఆర్టీసీలో తన అనుభవాలను వివరణాత్మకంగా పంచుకుంటానని సజ్జనార్ తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజారవాణాపై తన అనుబంధాన్ని చాటుకుంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోని TGSRTC షేర్ చేసింది.
Sajjanar rides city bus as ordinary passenger
టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు.
యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్… pic.twitter.com/qiBzq9odSI
— TGSRTC (@TGSRTCHQ) September 29, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)