తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కొరమేను చేపలతో కూర వండి భోజనం పంపించింది. చేపలకూరను వారే స్వయంగా ఆయనకు అందజేశారు.తాజా చేపలతో రుచికరమైన పులుసుతో పాటు, ఫ్రై చేసి రేవంత్ కు పసందైన భోజనం అందించారు. ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు.
Here's VIdeo
ఈ ప్రేమ ముందు... ఏ కష్టమైనా బలాదూర్…
పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన ఈ భోజనం “యాత్ర”లో నాకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.#YatraForChange #HaathSeHaathJodo pic.twitter.com/Az3pffvAQ5
— Revanth Reddy (@revanth_anumula) February 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)