మనందరివి చాలా చిన్న జీవితాలు , అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను. కాబట్టి హిళా రిజర్వేషన్‌లో నా ఎమ్మెల్యే సీటు పోయినా నేను బాధపడనని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌కి వసున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ ప్రాంతమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే, ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతున్న కొందరికి విద్యుత్ షాక్ తలిగింది. ఈ ఘటనలో విఠల్ (19), దుర్గేష్ (19 ), బాలరాజు (18), నాగనాథ్ (33)కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన నాగ్ నాథ్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)